
Call Us Now : +91 7670820884 / 885
Call Us Now : +91 7670820884 / 885
తెలుగు భాష అస్తిత్వం కోసం తెలంగాణ వైతాళికుడు కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా ఎంతో శ్రమించారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతి అనగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీని తెలుగు భాష దినోత్సవం గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
దేశభాషలందు తెలుగు లెస్స”. ఎన్ని భాషలు నేర్చినా మన మాతృభాషపై మమకారం వీడలేము. ఉగ్గుపాలతో రంగరించిన భాష మనది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కొన్ని కార్యక్రమాలు.
తెలుగు భాషా ప్రాధాన్యతను తెలియజేస్తూ రామాయణ, మహాభారత శ్లోకాలను చక్కగా ఆలపించారు. వర్ణమాలలోని అక్షరాలను తిప్పి చదువుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఒకటవ తరగతి విద్యార్థి శశివర్ధన్.
మన జీవన విధానానికి ఇతిహాసాలు ఎంతో ఉపయోగం అనడంలో ఆశ్చర్యం లేదు వ్యాసుడు, వాల్మీకి, కవిత్రయం, గణపతి వేషధారణలో రామాయణ , మహాభారత ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారు ఐదవ తరగతి విద్యార్థులు.
భాష ఏదైనా భావం ఒకటే తెలుగు భాషలోని యాసలను, మాండలికాలను చక్కగా అందరికీ మరొకసారి పరిచయం చేశారు నాలుగు మరియు ఐదో తరగతి విద్యార్థులు. ఈ విధంగా తెలుగు భాషా దినోత్సవం రోజు జరిగినటువంటి కార్యక్రమాలు తెలుగు భాష వైభవాన్ని మరో సారి చాటి చెప్పాయి.