
Call Us Now : +91 7670820884 / 885
Call Us Now : +91 7670820884 / 885
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, ప్రజా కవి ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించి తెలుగు భాష ఉనికి కోసం, తెలుగు ప్రజల కోసం కడదాకా పోరాటం జరిపిన యోధుడు శ్రీ కాళోజీ నారాయణరావు గారు. ఆయన వందవ జన్మదినాన్ని ‘తెలుగు భాషా దినోత్సవం’ గా జరుపుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆనాటి నుండి శ్రీ కాళోజీ నారాయణరావుగారి జన్మదినాన్ని ‘తెలుగు భాషాదినోత్సవంగా’ జరుపుకోవడం రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఆనవాయితీగా వస్తున్నది.
కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9 న రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయిని శ్రీమతి ఖమర్ సుల్తానా గారు, రమాదేవి ట్రస్టీ శ్రీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా దినోత్సవం ’ ఎంతో ఘనంగా జరిగింది. . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన , ఉపన్యాస , పద్య పఠనం , దస్తూరీ పోటీలను నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు మాతృభాష ప్రాముఖ్యతను , భాష పై పట్టును, మక్కువను , నిర్భయంగా మాట్లాడే ధైర్యాన్ని కలిగించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.
ఆనాడు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో మొబైల్ భూతం, తమాషా ప్రశ్నలు , చర్చా కార్యక్రమాలు ప్రేక్షకులకు నయనానందాన్ని ,శ్రవణానందాన్ని కలిగించాయి. కార్యక్రమాల అనంతరం ప్రధానోపాధ్యాయిని శ్రీమతి ఖమర్ సుల్తానా గారు విజేతలకు బహుమతులను అందజేసి, తెలుగు భాష ప్రాముఖ్యతపై తమ అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో తెలుగు విభాగం నుండి శ్రీమతి మంజుల , శ్రీమతి ఉమా కుమారి, శ్రీమతి లేపాక్షి, శ్రీమతి కవిత పాల్గొన్నారు. ఆనాటి కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది.